
IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించగలదా..?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ ఐదో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణించి రన్నరప్‌గా నిలిచింది. భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ మొదటి మ్యాచ్‌లోనే సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతోంది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్‌పై ఇంతవరకు 109 టీ20 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ఛేజింగ్ జట్లు 61 సార్లు గెలుపొందాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారం కానుంది.
రెండు ఇప్పటివరకూ 16 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో ఎనిమిది విజయాలను సాధించాయి
ఎస్ఆర్‌హెచ్
ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ జట్టులోని సభ్యులు
తొలి మ్యాచ్‌లోనే సన్ రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ ఐడెన్ మార్ర్కమ్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ మొదటి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
మార్క్రమ్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను భువనేశ్వర్ కుమార్ అందుకోనున్నారు. దీంతో హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ అగర్వాల్‌పై భారీ అంచనాలున్నాయి.
SRH (ప్రాబబుల్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్‌శర్మ, రాహుల్‌త్రిపాఠి, హ్యారీబ్రూక్, గ్లెన్‌ఫిలిప్స్ (వికెట్-కీపర్), సమద్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఆదిల్ రషీద్.
RR(ప్రాబబుల్ XI): బట్లర్, జైస్వాల్, శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), పడిక్కల్, హెట్మెయర్, పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, మరియు యుజ్వేంద్ర చాహల్