
IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023లో బలమైన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఈ జట్టు.. ఐపీఎల్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది.
రాజస్థాన్ తొలి మ్యాచ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్ 2న ఆడనుంది. రాజస్థాన్ జట్టులో కెప్టెన్ శాంసన్‌తో పాటు జోస్ బట్లర్, జోరూట్, ట్రెంట్‌బౌల్ట్, హోల్డర్ వంటి స్థార్ ఆటగాళ్లు ఉన్నారు.
గతేదాడి ఆరెంజ్ క్యాప్‌ను బట్లర్ కైవసం చేసుకున్నాడు. 17 మ్యాచ్‌ల్లో 149.05 స్ట్రైక్ రేట్‌తో 863 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలన్నాయి.
బట్లర్‌తో పాటు, శాంసన్ కూడా బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్నారు. గతేడాది శాంసన్ 146.79 స్ట్రైక్ రేట్‌తో 458 పరుగులు చేశాడు.. ఇందులో రెండు అర్ధ సెంచరీలున్నాయి
రాజస్థాన్
బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్
గతేడాది పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన యుజేంద్ర చాహెల్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఘనత కూడా చాహెల్ కు ఉంది. అతను 17 మ్యాచ్‌లలో మొత్తం 27 వికెట్లు తీయడంతోపాటు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
గాయం కారణంగా ఇప్పటికే ప్రసిద్ధ్ కృష్ణను కూడా జట్టు దూరం కావడం పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. IPL సీజన్‌ను ఆడుతున్న జో రూట్ కూడా రాయల్ మిడిల్ ఆర్డర్‌కు మరింత బలంగా నిలవనున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు : జోస్‌బట్లర్, జైస్వాల్, సంజు శాంసన్ (సి), జోరూట్, పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ