
ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డులను సృష్టించనున్నాడు. ప్రత్యర్థుల వికెట్లను తీయడంలో చాహెల్ ముందు ఉంటాడు. చాహల్ బౌలింగ్‌లో ఆడటానికి విధ్యంసకర బ్యాటర్లు కూడా వెనకడుగు వేస్తారు.
గత సీజన్లో రాజస్థాన్ తరుపున బౌలింగ్‌లో చాహెల్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నిలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడానికి చాహెల్ 18 వికెట్ల దూరంలో ఉన్నాడు.
2013లో ముంబై ఇండియన్స్‌తో తరుపున ఆడిన చాహెల్.. తర్వాత బెంగళూర్, రాజస్థాన్ తరుపున ఆడాడు. ప్రస్తుతం 131 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన చాహెల్ 166 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ల పరంగా డ్వేన్ బ్రావో(183), లసిత్ మలింగ్(170) ఆ తర్వాత స్థానంలో చాహెల్ నిలిచాడు.
చాహల్
చాహల్ సాధించిన రికార్డులివే
గత సీజన్‌లో చాహల్ 27 వికెట్లతో తీసి, ఐపీఎల్ పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్లో చాహెల్ 20 వికెట్లు పైగా తీయడం ఇది నాలుగోసారి.
గతంలో 2011, 2012, 2013, 2015లో 20 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా మలింగ నిలిచాడు. ఆర్సీబీ తరపున చాహెల్ 2015, 2016, 2020, రాజస్థాన్ తరుపున 2022లో 20 వికెట్లు పైగా తీసిన ఆటగాడిగా చాహల్ నిలిచాడు.
చాహల్ 131 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1,032 డాట్ బాల్స్‌ను వేశాడు, ఐపీఎల్‌లో 1,000 పైగా డాట్‌బాల్స్ సాధించిన 14 మంది బౌలర్లలో చాహల్ ఒకడు కావడం విశేషం.
భువనేశ్వర్‌కుమార్ 1,406 డాట్ బాల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇందులో చాహల్ 12వ స్థానంలో నిలిచాడు.