Page Loader
IPL 2023: ఐపీఎల్‌లో కొత్త రూల్స్ ఇవే
ఐపీఎల్ 16వ ఎడిషన్ మార్చి 31న ప్రారంభం

IPL 2023: ఐపీఎల్‌లో కొత్త రూల్స్ ఇవే

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2023
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ మాజా ఇంకా మూడురోజులలో ప్రారంభ కానుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లో చైన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోటీపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో బీసీసీఐ కొన్ని మార్పులను తీసుకొచ్చింది. పోయిన ఏడాది నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు పోటీ పడుతున్నాయి. 2021లో కోవిడ్-19 వ్యాప్తి కారణంగా అప్పట్లో కొన్ని మ్యాచ్‌లను UAEలో ఆడారు. IPL 2023 కోసం టెలివిజన్ హక్కులను రూ. 23,575 కోట్లకు డిస్నీప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. మ్యాచ్‌ స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, మలయాళం, కన్నడ భాషలలో ప్రసారం కానున్నాయి. డిజిటల్ హక్కులను రూ. 23,578 కోట్లకు వయకామ్ 18 కొనుగోలు చేసింది. జియో సినిమా 4k రిజల్యూషన్‌లో ఐపీఎల్‌ని ఉచితంగా చూడొచ్చు.

ఐపీఎల్

10 జట్లను రెండు గ్రూప్‌లుగా విడగొట్టారు

ఈ సీజన్‌లోనూ 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విడగొట్టింది. కానీ, ఇప్పుడు ఒక గ్రూప్‌లోని జట్టు.. అవతలి గ్రూప్‌లోని అయిదు జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గతంలో టాస్‌కు ముందే ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించే అవకాశం ఉండేంది. కానీ ఇప్పుడు క్లాజ్ 1.2.1 ప్రకారం ఈ రూల్‌ను మార్చేసింది. టాస్ తర్వాత రిఫరీకి సమర్పించే 11 మంది ప్లేయర్లు, ఐదుగురు సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ల లిస్ట్ నుంచి తమకు నచ్చిన జట్టును ఎంచుకోవచ్చు. దీంతో టాస్ గెలిస్తే ఒక టీంను, ఓడిపోతే మరో టీంను ఎంచుకోవచ్చు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు చేసిన లోపాలను నివారించడానికి వైడ్, నో-బాల్ కాల్‌లను సమీక్షించడానికి జట్లు ఇప్పుడు డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS)ని ఉపయోగించవచ్చు.