ఐపీఎల్‌లో రఫ్పాడించడానికి అండ్రీ రస్సెల్ రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ అండ్రీ రస్సెల్ ఐపీఎల్‌లో రఫ్పాడించడానికి సిద్ధమయ్యాడు. 2014 నుంచి కోల్ కత్తా నైట్ రైడర్స్ తరుపున అడుతున్న అండ్రీ రస్సెల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రస్సెల్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఈ ఐపీఎల్‌లో రస్సెల్ కొన్ని రికార్డులను బద్దలుకొట్టనున్నాడు.
రస్సెల్ 98 మ్యాచ్‌ల్లో 30.37 సగటుతో 2,035 పరుగులు చేశాడు. ఇందులో 10 అర్ధశతకాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో 24.48 సగటుతో 89 వికెట్లు పడగొట్టాడు.
రస్సెల్ కేకేఆర్ తరుపున 91 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 88 వికెట్లు పడగొట్టి, 1,977 పరుగులు చేశాడు. కోల్‌కతా జట్టు తరుపున 2,000 పరుగులు, 100 వికెట్లను ఈ ఐపీఎల్‌లో తీసే అవకాశం ఉంది.
రస్సెల్
ఐపీఎల్‌లో రస్సెల్ సాధించిన రికార్డులివే
ఇంతవరకూ ఈ రికార్డు రవీంద్ర జడేజా పేరున ఉంది. ఈ మైలురాయికి రస్సెల్ 23 పరుగులు, 12 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ తరుపున 88 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రస్సెల్ నిలిచాడు.
587 సిక్సర్లు బాదిన రస్సెల్ టీ20 చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు గేల్ (1,056), కీరన్ పొలార్డ్ (812) ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన రస్సెల్, 657 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.
ఐపీఎల్ చరిత్రలో 20 ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన ఘనత కూడా రస్సెల్ పేరిట ఉంది. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రస్సెల్ ఈ ఘనత సాధించాడు.