LOADING...
ఐపీఎల్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం.. కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఆటగాళ్లు..!
కేకేఆర్ కెప్టెన్‌గా నితీష్ రాణాకు ఛాన్స్

ఐపీఎల్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం.. కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఆటగాళ్లు..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 16, 2023
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మార్చి 31న ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఆహ్మదాబాద్‌లో జరిగిన చివరి టెస్టులో అయ్యర్ గాయపడటంతో బ్యాటింగ్ కూడా దిగలేదు. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అయ్యర్‌ను ఆస్పత్రికి తరలించి పలు పరీక్షలు జరిపించారు. టోర్నీ ప్రారంభానికి ముందే కెప్టెన్ సేవలను కోల్పోవడం కేకేఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అయ్యర్ 101 మ్యాచ్‌లలో 31.55 సగటుతో 2,776 పరుగులు చేసి ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా కేకేఆర్ అయ్యర్‌ను 2022 మెగా వేలంలో 12. 25 కోట్లకు దక్కించుకుంది.

షకీబ్ అల్ హసన్

స్వదేశీ ప్లేయర్‌కు కెప్టెన్సీ ఛాన్స్ దక్కేనా..?

వరల్డ్ నెంబర్ వన్ ఆల్‌రౌండర్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు ఐపీఎల్‌లో 71 మ్యాచ్‌లు ఆడి 793 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో 63 వికెట్లను తీశాడు. షకీబ్ తర్వాత టీమ్ సౌథీ పేరు కూడా కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 52 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. అయితే స్వదేశీ ప్లేయర్‌నే కెప్టెన్‌గా నియమించుకోవాలంటే మాత్రం నితీశ్ రాణా.. కేకేఆర్ బాధ్యతలను అందుకొనే అవకాశం ఉంది. కేకేఆర్ తరఫున 74 మ్యాచ్‌లు ఆడిన రాణా.. 1744 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలున్నాయి.