
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి టైటిల్‌ను ముద్దాడేనా ..?
ఈ వార్తాకథనం ఏంటి
2016లో చివరిసారిగా ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత అంతగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది. హేమాహేమీలు జట్టులో ఉన్నప్పటికీ బలమైన జట్లతో పోటీలో చతికిలా పడుతూ వస్తోంది.
2016, 2017, 2018, 2019లో వరుసగా నాలుగుసార్లు ఫ్లేఆఫ్‌కు సన్ రైజర్స్ అర్హత సాధించింది. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీకి ఐడెన్ మార్క్రామ్ నాయకత్వం వహిస్తున్నాడు.
గత రెండు సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన సన్ రైజర్స్ ఈసారి గట్టి పోటీ ఇస్తుందనే భరోసా కనిపిస్తోంది. ఏప్రిల్ 2న మొదటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
భువనేశ్వర్ కుమార్‌తోపాటు జట్టులో ఉమ్రాన్‌మాలిక్, జాన్సెన్, నటరాజన్, కార్తీక్ త్యాగితో రైజర్స్ బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది.
సన్ రైజర్స్
బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తే కప్పు ఖాయం
నాణ్యమైన స్పిన్ బౌలర్లు లేకపోవడం సన్ రైజర్స్ జట్టు ప్రధాన బలహీనత. ఆదిల్ రషీద్ ఒక్కడే స్పిన్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. సుందర్, మార్క్రామ్, అభిషేక్, మయాంక్ మార్కండే స్పిన్ బౌలింగ్‌లో అనుభవం ఉన్నా వాళ్లు ఎలా రాణిస్తారన్నదే అనుమానంగా ఉంది.
ఇటీవలే భారత్ తరఫున అరంగేట్రం చేసిన రాహుల్ త్రిపాఠి నం.3లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. గత సీజన్ నుండి మెరుగ్గా పరుగులు రాణిస్తున్నాడు. ఐడెన్ మార్క్రామ్ నెం.4లో బ్యాటింగ్ చేసి మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు రాబట్టే అవకాశం ఉంది.
బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తున్నా.. ఈసారీ కప్పు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.