కొత్త కుర్రాళ్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాజిక్ చేస్తుందా..?
2013లో ఐపీఎల్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 2016లో టైటిల్ సొంతం చేసుకుంది. గత రెండేళ్లుగా కనీసం ఫ్లేఆఫ్ కూడా క్వాలిఫై కాకుండా అభిమానులను నిరాశపరిచింది. 2023 వేలంలో దేశ, విదేశాలకు చెందిన కీలక ఆటగాళ్లను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారీ మార్పులతో ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో బరిలోకి దిగనుంది. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్, స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్, హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఇప్పటికే ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగే ఛాన్సుంది. మయాంక్ అగర్వాల్‌ను సన్ రైజర్స్ జట్టు రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది.
బౌలింగ్‌లో మెరుగ్గా సన్ రైజర్స్ జట్టు
మిడిలార్డర్‌లో త్రిపాఠీ, కెప్టెన్ మార్క్రమ్, హ్యారిబ్రూక్ సత్తా చాటే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సన్ రైజర్స్ జట్టుకు అదనపు బలం. వీరికి తోడు హెన్‌రిచ్ క్లాసేన్ ఇప్పటికే సౌతాఫ్రికా టీ20ల్లో స్టైలిష్ బ్యాటింగ్‌తో నిరూపించుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ అన్ని జట్ల కన్నా మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. 157 కి.మి వేగంతో బంతుల విసిరే ఉమ్రాన్ మాలిక్ గతేడాది ఐపీఎల్ 2022 లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అదిల్ రషీద్ కి కూడా బౌలింగ్‌లో మంచి అనుభవం ఉంది. దక్షిణాఫ్రికా స్టార్ మార్ర్కమ్ సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని సారథ్యంలో ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ టైటిల్‌ను సాధించింది.
సన్ రైజర్స్ జట్టులోని సభ్యులు
ఫజల్లాక్ ఫరూకీ, మార్కో జాన్సెన్, కార్తిక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ రూపంలో పేస్ బౌలర్లు జట్టుకు అదనపు బలంగా ఉండనున్నారు. స్పిన్నర్ల విషయానికి వస్తే.. మయాంక్ మార్కండే, అకీల్ హొస్సేన్, వాషింగ్టన్ సుందర్, అదిల్ రషీద్ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడానికి సిద్ధమయ్యారు. సన్ రైజర్స్ జట్టు: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్‌శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకేల్ హొస్సేన్, నితీష్ కుమార్‌రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్‌సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ వ్యాస్‌శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్‌రషీద్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్‌కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, కార్తీక్‌త్యాగి, ఫజల్హాక్ ఫరూఖీ