LOADING...
సూపర్ ఫామ్ లో  మార్ర్కమ్ మామా.. ఇక సన్‌రైజర్స్ కప్పు కొట్టినట్లే..!
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా మార్ర్కమ్

సూపర్ ఫామ్ లో మార్ర్కమ్ మామా.. ఇక సన్‌రైజర్స్ కప్పు కొట్టినట్లే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2023
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఐడెన్ మార్ర్కమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల అతను సూఫర్ ఫామ్‌లో ఉండటంతో కచ్చితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి స్టార్ ఆటగాళ్లను వదిలేసుకున్న సన్ రైజర్స్.. ఐడెన్ మార్క్రమ్ పై భారీ ఆశలను పెట్టుకుంది. మార్ర్కమ్ సారథ్యంలో ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌‌ను ఓడించి సన్ రైజర్స్ ఈస్టర్న్ ఫ్రాంచేజీకి టైటిల్‌ను అందించాడు. దక్షిణాఫ్రికా ప్రపంచ‌కప్ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా కూడా నిలిచాడు. 2014లో అతని కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా అండర్ -19 ప్రపంచకప్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే.

మార్ర్కమ్

మార్ర్కమ్ పైనే భారీ ఆశలు

సన్ రైజర్స్ తరుపున గతేడాది ఒక్క సీజన్‌ మాత్రమే ఆడిన మార్క్రమ్ 12 ఇన్నింగ్స్‌లలో 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టెస్టులు, వన్డేల్లో అంత ప్రభావవంతంగా మార్ర్కమ్ లేకపోయినా టీ20ల్లో మాత్రం అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో ఈ ఆటగాడు ఇప్పటివరకు 31 మ్యాచ్‌లలో 148 స్ట్రైక్ రేట్‌తో 879 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ 20 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మార్క్రమ్ 40.54 సగటుతో 527 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకొనే మార్క్రమ్ ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఎలా రాణిస్తాడో వేచిచూడాల్సిందే.