స్టార్ ఆటగాళ్లతో పట్టిష్టంగా సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. గతేడాది చెత్త ప్రదర్శనతో ఎనిమిదో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. రెండు సీజన్లు వరుసగా విఫలం కావడంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా 12 మంది ఆటగాళ్లు ఫ్రాంఛేజీ వదలుకుంది. గతంలో కంటే చాలా బలంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ ఈసారైనా అభిమానులను అలరిస్తుందో లేదో చూడాలి. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభమవుతోంది. ఏప్రిల్ 2న మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. ఈసారి వేలంలో హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లు, మయాంక్ అగర్వాల్ రూ.8.25 కోట్లు, హెన్రిచ్ రూ.5.25 కోట్లు, ఆదిల్ రషీద్ రూ. 2కోట్లు, వివ్రాంత్ శర్మకు రూ.2.6కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
బ్యాటింగ్ విభాగంలో బలంగా సన్‌రైజర్స్
2013 సీజన్‌లో అరంగేట్రం చేసిన ఎస్ఆర్‌హెచ్, మొదటి ఎనిమిది సీజన్‌లలో ఆరుసార్లు ప్లేఆఫ్‌లకు చేరుకుంది. 2016లో ఛాంపియన్‌గా నిలిచింది. మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠిలతో టీమ్ బ్యాటింగ్ పటిష్టంగా మారింది. ఉమ్రాన్ మాలిక్, నటరాజర్, భువనేశ్వర్‌కుమార్, ఆదిల్‌రషీద్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది సన్ రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), త్రిపాఠి, ఫిలిప్స్, అభిషేక్‌శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫరూఖీ, కార్తీక్‌త్యాగి, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్‌మాలిక్, హ్యారీబ్రూక్, మయాంక్ అగర్వాల్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, యాదవ్, మయాంక్ దాగర్, నితీష్ కుమార్‌రెడ్డి, అన్మోల్‌ప్రీత్‌సింగ్, అకేల్ హోసేన్