LOADING...
WTC: వికెట్ కీపర్ ఎంపికపై డైలామాలో టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన భరత్

WTC: వికెట్ కీపర్ ఎంపికపై డైలామాలో టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2023
06:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా జూన్ 7న తలపడనున్నాయి. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1తో టీమిండియా ఓడించింది. డిసెంబరు 2022లో పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతని స్థానంలో భరత్‌కు టీమిండియా అవకాశం కల్పించింది. ప్రస్తుతం అనుకున్న అంత స్థాయిలో భరత్ రాణించకపోవడంతో బోర్డర్ గవాస్కర్ ఫైనల్‌లో టీమిండియా వికెట్ కీపర్ ఎంపిక ప్రశ్నార్థకంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ వరుసగా 8, 6, 23*, 17, 3, 44 పరుగులు చేశాడు. అతను ఆరు ఇన్నింగ్స్‌లలో 20.20 సగటుతో 101 పరుగులు చేశాడు.

కేఎస్ భరత్‌

భరత్ స్థానంలో కేఎల్ రాహుల్‌ని ఆడించాలి

KL రాహుల్ ఓపెనర్‌గా ఆసీస్‌తో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో 20, 17, 1 స్కోరు చేశాడు. రెండు టెస్టులో విఫలమైన రాహుల్ స్థానంలో శుబ్‌మాన్ గిల్‌ని ఆడించారు. భరత్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలని సునీల్ గవాస్కర్ చెప్పారు. ఇంగ్లండ్ పై కేఎల్ రాహుల్ కు మంచి అనుభవం ఉంది. ఇంగ్లండ్ పై 9 మ్యాచ్ లు ఆడిన రాహుల్ 34.11 సగటుతో 614 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉంది. 2018లో ఇంగ్లండ్‌లో పర్యటించి రాహుల్ 299 పరుగులు చేసిన విషయం తెలిసిందే.