డబ్ల్యూటీసీ ఫైనల్లో రాహుల్‌ని ఆడించాలి : గవాస్కర్
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. అటు శ్రీలంకను తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడించడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌కు టీమిండియా క్వాలిఫై అయింది. ఇప్పుడు ఫైనల్లోనూ ఆస్ట్రేలియాతోనే టీమిండియా టైటిల్ కోసం పోరాడనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ కీపర్ కేఎస్భరత్ పూర్తిగా నిరాశపరిచాడు. డబ్య్లూటీసీ ఫైనల్లో కేఎస్ భరత్‌ను పక్కనపెట్టి, టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కు అవకాశమివ్వాలని గవాస్కర్ సూచించాడు.
రాహుల్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక తుది జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.
కేఎల్ రాహుల్
ఇంగ్లాండ్‌పై రాహుల్‌కు మెరుగైన రికార్డు
కేఎల్ రాహుల్‌కు ఇంగ్లాండ్‌పై మంచి రికార్డు ఉందని సన్నీ గుర్తు చేశాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వినియోగించుకుంటే ఐదు లేదా ఆరో స్థానంలో భారత్ బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుందని, డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టు ఎంపిక చేసే సమయంలో కేఎల్ రాహుల్ ను గుర్తుపెట్టుకోవాలని సునీల్ గవాస్కర్ వివరించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టులో విఫలమైన రాహుల్ తన వైస్ కెప్టెన్ పదవితో పాటు జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.
రిషబ్ పంత్ ప్రమాదంలో గాయపడినప్పటి నుంచీ టెస్టుల్లో వికెట్ కీపింగ్ స్థానం భర్తీ చేయడం టీమిండియాకు సవాలుగా మారింది.