Page Loader
ఇషాన్ కిషన్ వర్సెస్ కెఎస్ భరత్
టీమిండియా తరుపున అంతర్జాతీయ స్థాయిలో ఇంకా భరత్ ఆడలేదు

ఇషాన్ కిషన్ వర్సెస్ కెఎస్ భరత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2023
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.‌ రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురి కావడంతో ఇషాన్ కిషన్ కు చోటు కల్పించారు. ప్రస్తుతం వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, భరత్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరిని అడించాలో అర్ధం కాక టీమిండియా తలలు పట్టుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే భారత్‌కి కనీసం 2-0 తో సిరీస్ ను గెలవాలి

ఇషాన్ కిషన్

ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ సాధించిన రికార్డులివే

కిషన్ డిసెంబర్ 2014లో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు 48 గేమ్‌లలో 2,985 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో అరు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలున్నాయి. భారత్ కొంతకాలంగా టెస్టుల్లో భారత బ్యాకప్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. 86 ఎఫ్‌సీ మ్యాచ్‌ల్లో 4707 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం 9 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలున్నాయి. 2022-23 రంజీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడి 205 పరుగులు చేశాడు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కిషన్ 13 వన్డేలను ఆడి 507 పరుగులు చేశఆడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలున్నాయి. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఐదుగురు భారతీయులలో కిషన్ ఒకరు.