
నాగపూర్‌లో టెస్టు సమరానికి సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా
ఈ వార్తాకథనం ఏంటి
గత రెండు దశాబ్దాల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అద్భుతమైన, చిరస్మరణీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఎన్నో రికార్డులు, ఘనతలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రపంచ క్రికెట్లో అన్నింటికంటే అత్యత్తుమ టెస్టు పోరుగా మార్చేశాయి. ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌పై రెండు జట్లు సమరం మొదలైంది.
నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, సాధారణంగా స్పిన్‌కు అనుకూలమైన ఉపరితలాన్ని అందిస్తుంది, ఇది సిరీస్ ప్రారంభానికి ఆతిథ్యం ఇస్తుంది. ఈ మ్యాచ్ లో తొలి మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని.. చివరి రెండు రోజులు మాత్రం స్పిన్నర్లు ప్రభావం చూసే అవకాశం ఉంటుందని పిచ్ క్యూరేటర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
టీమిండియా
భారత్ విజయఢంకా మోగించేనా..?
నాగ్‌పూర్ చివరిగా నవంబర్ 2017లో (భారత్ వర్సెస్ శ్రీలంక) టెస్టుకు ఆతిథ్యం ఇచ్చింది. ఆ టెస్టులో ఇండియా 239 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ డబుల్ సెంచరీ చేయగా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరు కలిసి 13 వికెట్లు తీశారు. ఇక్కడ జరిగిన ఆరు టెస్టుల్లో భారత్ నాలుగింటిలో విజయం సాధించడం గమనార్హం.
2008-09 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మొట్టమొదటిగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ సెంచరీ చేయడంతో ఆ టెస్టులో భారత్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అప్పటి కెప్టెన్ ధోనీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించాడు. మాజీ స్పిన్నర్ జాసన్ క్రెజ్జా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టాడు