Page Loader
కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!
కోహ్లీ చివరిసారిగా 2019లో టెస్టులో సెంచరీ సాధించాడు

కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2023
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే అంత సులభమేమీ కాదు, ప్రస్తుతం అందరి చూపు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌లో కింగ్ కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి. విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా పై మెరుగైన రికార్డు ఉంది. ప్రస్తుతం వన్డే, టీ20లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఆస్ట్రేలియాపై భారీ పరుగులు సాధించాలని అభిమానులు అశిస్తున్నారు. కోహ్లి తన చివరి సెంచరీని 2019లో బంగ్లాదేశ్‌పై సాధించాడు. అప్పటి నుండి కోహ్లి 36 ఇన్నింగ్స్‌లలో కేవలం 26.2 సగటుతో 917 పరుగులు మాత్రమే సాధించాడు.

విరాట్ కోహ్లీ

కోహ్లీ సాధించిన రికార్డులివే

ఆస్ట్రేలియాపై 20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 48.05 సగటుతో 1,682 పరుగులు చేశాడు.ఇందులో ఏడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అస్ట్రేలియాపై కోహ్లీ అత్యధికంగా 169 పరుగులను చేశాడు. సొంతగడ్డపై కోహ్లీ 11 ఇన్నింగ్స్‌లలో 33.00 సగటుతో 330 పరుగులు చేయగలిగాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉంది. 2017లో స్వదేశంలో జరిగిన చివరి సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆసీస్‌ను ఓడించింది. కోహ్లి ఈ సిరీస్‌లో చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌లో 9.20 సగటుతో 46 పరుగులను మాత్రమే చేశాడు. కోహ్లీ మొత్తం 104 టెస్టు మ్యాచ్ లను ఆడాడు. 48.90 సగటుతో 8,119 పరుగులు చేశాడు.ఇందులో 27 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలున్నాయి.