స్టీవ్ స్మిత్‌ను అశ్విన్ అపగలడా..?
ఫిబ్రవరి 9నుంచి నాగ్ పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా నెట్స్‌లో చెడటోడుస్తోంది. ముఖ్యంగా భారత స్పిన్నర్లను ఎదుర్కొనడం కోసం వ్యూహాలను రచిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ రన్ మెషీన్ స్టీవ్ స్మిత్, టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవించంద్రన్ అశ్విన్ మధ్య పోరు జరగనుంది. స్మిత్ టీమిండియాతో మ్యాచ్ అంటేనే చెలరేగిపోతున్నాడు. స్మిత్ వికెట్ తీయడంలో అశ్విన్ మెరుగైన రికార్డు ఉంది. అశ్విన్‌పై స్మిత్ 19 ఇన్నింగ్స్‌ల్లో 68.66 సగటుతో 412 పరుగులు చేశాడు. ఆరుసార్లు అశ్విన్ బౌలింగ్‌లో స్మిత్ ఔటయ్యాడు. అశ్విన్ పై స్మిత్ కు మెరుగైన రికార్డు ఉండడం గమనార్హం.
స్టీవ్ స్మిత్ వర్సస్ రవిచంద్రన్ అశ్విన్
భారత్‌పై 14 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 1,742 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. భారతదేశంలో, స్మిత్ కేవలం ఆరు టెస్టుల్లో 60.00 సగటుతో 660 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2017 సిరీస్‌లో మూడు సెంచరీలు చేయడం గమనార్హం. 92 టెస్టులాడిన స్మిత్ 8,647 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి అశ్విన్ 88 మ్యాచ్‌లలో 24.30 సగటుతో 449 వికెట్లు పడగొట్టాడు. 2017లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సిరీస్‌లో అశ్విన్ 21 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2013 సిరీస్‌లో 20.10 సగటుతో 29 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.