కెఎల్ రాహుల్ నీ ఆటకో దండం స్వామి
విధ్వంసకర బ్యాట్‌మెన్‌గా పేరున్న భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. ప్రస్తుతం చెత్త బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టి అశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. టెస్టులో వరుసుగా 10, 2, 22, 23 స్కోర్ నమోదు చేశాడు. గాయంతో టీమిండియా దూరమైన రాహుల్ ఆగస్టులో జరిగిన జింబాబ్వే వన్డే సిరీస్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. 2022లో 30 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 25.68 సగటుతో 822 పరుగులు చేశారు. టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమై 17.12 సగటుతో స్కోర్ చేశారు. రాహుల్ చివరిసారిగా 2021 సెంచూరియన్ టెస్టులో టెస్ట్ శతకం సాధించాడు. అప్పటి నుంచి వరుసుగా 23, 50, 8, 12, 10, 22, 23, 10, 2 పరుగులు చేశాడు.
రాహుల్ అశించిన స్థాయిలో రాణించలేదు
రాహుల్ 2022లో 10 వన్డేలు ఆడి, 251 పరుగులు చేశాడు. ముఖ్యంగా, రాహుల్ ఈ తొమ్మిది వన్డేలను విదేశాల్లో ఆడాడు. వన్డేల్లో కూడా అశించిన స్థాయిలో రాణించలేదు. రాహుల్ 2022 ICC T20 ప్రపంచ కప్‌లో మొదటి మూడు ఇన్నింగ్స్ లో రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. భారత్- ఇంగ్లాడ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో మరి దారుణంగా విఫలమయ్యాయి. రాహుల్ T20 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడాడు. పాకిస్తాన్ (దుబాయ్) 18(16), న్యూజిలాండ్ (దుబాయ్)4(8) , పాకిస్తాన్ (మెల్‌బోర్న్), 9(14),దక్షిణాఫ్రికా (పెర్త్) 5(5) పరుగులు చేసి చెత్త రికార్డును నమోదు చేసుకున్నారు.