Page Loader
America: అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీ.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు  
అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీ.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

America: అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఢీ.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2025
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మరోసారి రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రైవేట్‌ జెట్‌ను మరో విమానం గుద్దుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. లియర్‌జెట్ 35ఎ విమానం ల్యాండింగ్‌ అయిన తర్వాత రన్‌వే నుండి జారి, రాంప్‌పై నిలిపి ఉన్న బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన ఆరిజోనాలోని స్కాట్‌డేల్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, గత పది రోజుల వ్యవధిలో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం. దీంతో, ఎయిర్‌పోర్ట్‌లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానాలు ఢీకొన్న వీడియో