Gaza Strip: పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 27 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఏఎఫ్) గాజా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక బాంబుదాడులు జరిపింది. ఈ దాడుల్లో మొత్తం 27 మంది మృతిచెందినట్టు గాజా డిఫెన్స్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. గాజా పరిపాలనా అధికారులు అందించిన వివరాల ప్రకారం.. గాజా సిటీ పరిధిలో 14 మంది, ఖాన్ యూనిస్ ప్రాంతంలో మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
గాజా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు
ఈ మరణాల గణాంకాలను హమాస్ సంస్థ కూడా ధృవీకరించింది. ఇక ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం మాత్రం వేరే వివరణను చెబుతోంది. తమ దేశంపై దాడి చేయడానికి హమాస్ మిలిటెంట్లు సిద్ధమవుతున్నారన్న నమ్మకమైన సమాచారంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపింది. ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తూ ఈ వైమానిక దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ స్పష్టం చేసింది. ఇరువైపుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో గాజా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పెరిగిపోయాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హమాస్ ఉగ్రవాదులే లక్ష్యమని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
Israeli airstrikes kill 27 in Gaza
— WION (@WIONews) November 20, 2025
Hamas calls the strikes a 'dangerous escalation' a@Shivanchanana and @bisladiksha bring you this report pic.twitter.com/SMkfbb0aLc