Page Loader
Pakistan: సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు
సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు

Pakistan: సింధు నదిలో 33 టన్నుల బంగారం నిల్వల గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, అటోక్ జిల్లాలో సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. ఈ నిల్వలు దాదాపు 32.6 టన్నుల బంగారమని, వాటి విలువ రూ.18 వేల కోట్లు (600 బిలియన్‌ పాకిస్థానీ రూపాయలు) ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (జీఎస్‌పీ) ఈ వివరాలను ధ్రువీకరించింది. పాక్‌లో ప్రస్తుతం నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో జల జీవితం కష్టంగా మారిందని చెప్పొచ్చు. అలాగే వరుస ఉగ్రదాడులతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో సింధూ నది లోయలో బంగారం నిల్వలు వెలికితీశారు. ఈ వార్త పాకిస్థాన్ ప్రజలకు కొత్త ఆశల్ని నింపింది.

Details

నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం

బంగారం వెలికితీయడం ప్రారంభం కాగానే, పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థకు పునరుద్ధరణ దిశగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా దేశపు అప్పుల భారాన్ని తగ్గించి, కరెన్సీ విలువను బలోపేతం చేసుకోవచ్చు. ఫలితంగా నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు తగ్గడం ద్వారా ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటన చేయడంతో, సింధూ నది లోని బంగారం నిల్వలు వెలికితీయడం ప్రారంభించడానికి పూర్తిగా దృష్టి పెట్టామని తెలిపారు. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు వ్యాపించాయన్నారు. అలాగే పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలను గుర్తించామన్నారు.

Details

అక్రమ మైనింగ్ పై నిషేధం

పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్‌లలో కూడా బంగారం నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై నిషేధం అమలు చేస్తామని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగార గనుల్లో మైనింగ్‌ జరుగుతుందని స్పష్టం చేశారు. సింధు నది, పాకిస్థాన్‌లో ప్రవహించి హిమాలయాల్లోకి చేరుతుంటుంది. ఈ నది పరివాహక ప్రాంతంలో టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల బంగారం అణువులు ఏర్పడతాయి. అవి నది ప్రవాహం ద్వారా పాకిస్థాన్‌ లోని ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తాయి. ఈ నిరంతర ప్రవాహం వల్ల శతాబ్దాల పాటు బంగారం అణువులు సింధు నది లోయలో పేరుకుపోయాయి.