Loading...
India investment in USA: అమెరికాకు భారత్‌ నుంచి 330 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. వైట్‌హౌస్‌ కీలక ప్రకటన!
అమెరికాకు భారత్‌ నుంచి 330 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. వైట్‌హౌస్‌ కీలక ప్రకటన!

India investment in USA: అమెరికాకు భారత్‌ నుంచి 330 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. వైట్‌హౌస్‌ కీలక ప్రకటన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2026
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వైట్‌హౌస్‌ (White House) తాజాగా వెల్లడించింది. తమ దేశంలోకి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయని పేర్కొంది. ఇందులో భారత్‌ నుంచే 330 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు తెలిపింది. అమెరికాలో ప్రైవేటు పరిశ్రమలు, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల మొత్తం విలువ 10.87 ట్రిలియన్‌ డాలర్లుగా వెల్లడించింది. ఈ గణాంకాలను వైట్‌హౌస్‌ తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో పదే పదే ప్రసారం చేసింది. అంతేకాకుండా, అమెరికా ప్రజలను ఉద్దేశించి ఎక్స్‌ (X) వేదికగా ఆసక్తికరమైన పోస్టు పెట్టింది. ''అమెరికాలోకి ట్రిలియన్ల కొద్దీ డబ్బు వచ్చి చేరుతున్న శబ్దాన్ని హాయిగా కూర్చొని ఆస్వాదించండంటూ పేర్కొంది.

వివరాలు

అమెరికాలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి

దీంతో అమెరికాలోకి వస్తున్న విదేశీ పెట్టుబడులపై మరోసారి చర్చ మొదలైంది.

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం బ్రౌన్స్‌విల్‌ ప్రాంతంలో కొత్త రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్‌ భాగస్వామిగా ఉంది.

దీని కోసం రిలయన్స్‌ 300 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఏడాది మార్చిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రకటన వెలువడింది.

మరోవైపు భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎస్సార్‌ గ్రూప్‌ (Essar Group) కూడా అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.

తన అనుబంధ సంస్థ మొసాబి మెటాలిక్స్‌ (Mesabi Metallics) ద్వారా అమెరికాలో 15 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. అయోవా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనుంది.

వివరాలు

సెలక్ట్‌ యూఎస్‌ఏ సదస్సులో రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలు

మే నెలలో జరిగిన సెలక్ట్‌ యూఎస్‌ఏ (SelectUSA) ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు సందర్భంగా భారత పారిశ్రామిక వర్గాలు అమెరికాలో 20.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించాయి.

ఈ పరిణామాలు అమెరికాలో భారతీయ సంస్థల పెట్టుబడుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

20 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సాధించాం: ట్రంప్

ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వచ్చేనెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికల కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచార సభల్లో తన ప్రభుత్వ హయాంలో అమెరికాకు వచ్చిన పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తున్నారు. తన పాలనలో 20 ట్రిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులు, పెట్టుబడి హామీలను సాధించినట్లు చెబుతున్నారు.

వైట్‌హౌస్‌ వెల్లడించిన గణాంకాలు, ట్రంప్‌ ప్రచారంలో ప్రస్తావిస్తున్న పెట్టుబడుల వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

అమెరికాలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో భారత్‌ వాటా కూడా కీలకంగా నిలుస్తోంది.

ADVERTISEMENT