Loading...
Panama: పనామాలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు
పనామాలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు

Panama: పనామాలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పనామాలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం చోటుచేసుకున్న ఈ భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూరోపియన్‌-మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ (EMSC) వెల్లడించింది. కాగా, గత శుక్రవారం పనామాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు కారణంగా వందలాది నివాస సముదాయాలు దెబ్బతిన్నాయి. సుమారు 900 భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగనప్పటికీ, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాలు 

పనామాలో దాదాపు 300 ప్రకంపనలు

భారీ భూకంపం తర్వాత కూడా పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదు. అప్పటి నుంచి పనామాలో దాదాపు 300 ప్రకంపనలు నమోదయ్యాయి.

వరుసగా భూప్రకంపనలు సంభవిస్తుండటంతో పనామా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రారంభించింది. ముఖ్యంగా లాస్ శాంటోస్, కోక్లే, హెర్రెరా ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేశారు.

ఇప్పటికే భారీగా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పనామాలో మళ్లీ భూకంపం.. 35 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు

ADVERTISEMENT