Plane Crash: కుప్పకూలిన మినీ విమానం.. ఏడుగురు మృతి
Plane Crashes In Brazil: బ్రెజిల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. బ్రెజిల్‌లోని ఆగ్నేయ మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఆదివారం చిన్న విమానం కూలిపోవడంతో ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు. సావో పాలో రాష్ట్రంలోని కాంపినాస్ నుంచి విమానం బయలుదేరిన తర్వాత.. గాల్లో ఉండగానే అది ముక్కలై ఇటాపెవాలో ఉదయం 10:30 గంటలకు కుప్పకూలినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన బాధితుల మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది కనుగొన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపై దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు.