Boat Capsizes: అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం.. 250 మంది గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులతో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం సముద్రంలో తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కనిపించకుండా పోయిన వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఉన్నతాధికారి కార్యాలయం,వలసల అంతర్జాతీయ సంస్థ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
వివరాలు
బోటులో పరిమితిని మించి ప్రయాణికులు
ఆ ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ ప్రాంతం నుంచి బయలుదేరింది. మలేసియా వైపు ప్రయాణిస్తున్న సమయంలో బలమైన ఈదురుగాలులు, భారీ కెరటాల కారణంగా పడవ మునిగినట్లు తెలిపారు. అదేవిధంగా, పడవలో అనుమతించిన పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణమై ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
250 మంది గల్లంతు
Report from Global Banking & Finance Review Tragedy at sea underscores the Rohingya refugee crisis: 250 missing after a capsize in the Andaman Sea. Urgent need for durable solutions, lifesaving aid, and sustained international support for refugees and ho… https://t.co/UGVj2qxayg
— Global Banking & Finance Review (@GBAFReview) April 14, 2026