అప్ఘానిస్థాన్: దొంగతనానికి పాల్పడిన నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు
అప్ఘానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం దారుణానికి ఒడిగట్టింది. దొంగతనాలతో పాటు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలను అమలు చేస్తోంది. తాజాగా కాందహార్‌లో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మందికి కఠిన శిక్షను అమలు చేసింది. కాందహార్‌లోని ఒక ఫుట్‌బాల్ స్టేడియంలో ఈ తొమ్మిది మంది దొంగతనానికి పాల్పడ్డారు. వారిని ఆ స్డేడియంలోనే ప్రేక్షకుల ముందు కొరడాతో తాలిబన్లు కొట్టారు. అనంతరం అందులో నలుగురి చేతులను బహిరంగంగా ప్రజల మధ్య నరికేశారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
1990లో మాదిరిగానే శిక్షలను అమలు చేస్తున్న తాలిబన్లు
దొంగతానికి పాల్పడిన వారి చేతులను నరికివేడాన్ని పౌర సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్టేడియంలో ఈ శిక్షను అమలు చేస్తున్నప్పుడు అఫ్ఘాన్ జర్నలిస్టు తాజుడెన్ సోరౌష్ వీడియో తీశారు. ఆ వీడియోను అనంతరం ట్విట్టర్‌లో పోష్ట్ చేశారు. అప్ఘాన్‌లో చరిత్ర పునరావృతమైందని తాజుడెన్ సోరౌష్ చెప్పారు. 1990లో మాదిరిగానే తాలిబన్లు శిక్షలను అమలు చేయడం ప్రారంభించనట్లు తాజుడెన్ వివరించారు. తాబిబన్లు గతేడాది హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని బహిరంగంగానే ఉరి తీశారు. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, బహిరంగంగా ఉరితీయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక దొంగతనాలకు పాల్పడినప్పుడు ఉరితీయడం ఇక్కడ సర్వసాధారణమనే చెప్పాలి.