Viral video: విమానంలో భయానక క్షణాలు.. ల్యాండింగ్ విఫలం కావడంతో ప్రయాణికుల్లో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
కొలంబియాలో ఓ ప్రయాణికుల విమానం ల్యాండింగ్ సమయంలో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. పర్వత ప్రాంతంలో ఉన్న విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని రెండుసార్లు ల్యాండింగ్ చేయాలన్న పైలట్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. బొగోటా నగరం నుంచి పాస్టో విమానాశ్రయానికి బయలుదేరిన ఈ విమానం గమ్యస్థానానికి చేరుకునే సమయంలో సమస్యలు ఎదుర్కొంది. సముద్ర మట్టానికి సుమారు ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ విమానాశ్రయం పరిసరాల్లో దట్టమైన పొగమంచు, బలమైన గాలులు ఉండటంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడం కష్టంగా మారింది.
వివరాలు
తిరిగి బొగోటాకు..
మొదటిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించిన పైలట్‌కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ప్రయత్నం విఫలమైంది. అనంతరం మరోసారి ప్రయత్నించినప్పటికీ విమానాన్ని రన్‌వేపైకి తీసుకురాలేకపోయారు. వరుసగా రెండు ప్రయత్నాలు విఫలమవడంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో కన్నీళ్లు పెట్టుకోగా, మరికొందరు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. ఈ సమయంలో విమానంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రయాణికులు చిత్రీకరించగా, ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా లేకపోవడంతో పైలట్ మరోసారి ప్రమాదకర ప్రయత్నం చేయకుండా విమానాన్ని తిరిగి బొగోటాకు మళ్లించారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వాతావరణం మెరుగుపడిన తర్వాత విమానం మళ్లీ ప్రయాణం ప్రారంభించి సురక్షితంగా పాస్టో విమానాశ్రయానికి చేరుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భయంతో ప్రార్థనలు చేసిన ప్రయాణికులు
ALERT: Frightened passengers openly praying as people cry, scream, and throw up after having to abort landing multiple times at a notorious mountain runway.
— E X X ➠A L E R T S (@ExxAlerts) May 27, 2026
Avianca Airlines flight AV9401 from Bogotá, Colombia, to the remote city of Pasto was forced to divert twice due to thick… pic.twitter.com/N8L3E6LEgz