ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక!
ప్రపంచ బ్యాంక్ తదుపరి చీఫ్‌గా మాస్టర్‌కార్డ్ మాజీ సీఈఓ, భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖారారైంది. ప్రపంచ బ్యాంక్ చీఫ్ పదవికి బుధవారంతో నామినేషన్లు పూర్తయ్యాయి. గడువు ముగిసే సమయానికి అజయ్ బంగా ఒక్కరే నామినేషన్ వేశారు. మిగతా ఏ దేశం కూడా తమ అభ్యర్థిని ప్రతిపాదించలేదని బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెప్పింది. 63 ఏళ్ల అజయ్ బంగాను గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ పదవికి నామినేట్ చేశారు. ప్రపంచ బ్యాంక్ అదిపతిగా అజయ్ బంగా బాధ్యతలు చేపడితే ఆ పదవి చేపట్టిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు.
ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో అజయ్ బంగా నిపుణుడు
ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ తన ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి దాదాపు ఒక సంవత్సరం ముందు పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ పదవికి అమెరికా నుంచి అజయ్ బంగా నామినేషన్ వేశారు. మాల్పాస్‌ను 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. ఆయన ఏకగ్రీవంగా ఆ పదవిని చేపట్టారు. ప్రపంచ బ్యాంకులో ఉన్నత ఉద్యోగం ఎప్పుడూ అమెరికా అభ్యర్థికే దక్కడం అనివార్యంగా మారింది. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో బంగా అనుభవజ్ఞుడు. అతను పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆర్మీ కుటుంబంలో జన్మించారు. మహారాష్ట్రలోని పూణేలో పెరిగారు. అక్కడే అతని తండ్రి ఉద్యోగం నిర్వహించారు.