
Burkina Faso attack: బుర్కినా ఫాసోలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న ముష్కరుల నరమేధం.. 100 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో తీవ్రవాదులు ఘోర ఘాతుకానికి పాల్పడ్డారు.
ఈఉగ్ర దాడిలో 100 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ప్రాణనష్టం చెందినవారిలో పెద్ద సంఖ్యలో సైనికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానిక ప్రభుత్వ అధికారుల ప్రకారం,ఈదారుణ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
దేశం ఉత్తర భాగంలో ఉన్న పలు ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసి దాడులు జరిపారు.
ఈదాడుల్లో సైనిక స్థావరాలు మాత్రమే కాకుండా, డ్జిబో అనే పట్టణం కూడా లక్ష్యంగా మారింది.
ఇటీవల బుర్కినా ఫాసోలోని సాహెల్ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో,అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న'జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్' అనే గ్రూప్ ఈదాడులకు పాల్పడినట్టు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముష్కరుల నరమేధం.. 100 మంది మృతి
🇧🇫: Yesterday, militants from Jama'at Nasr al-Islam wal Muslimin (JNIM), an al-Qaeda-affiliated group, launched a large-scale assault on army positions in the city of Djibo, Soum Province, northern Burkina Faso.
— Burkina Faso🇧🇫 update (@UBA39285039) May 12, 2025
At dawn, hundreds of militants attacked from the west, targeting… pic.twitter.com/lv2j4CO31A