Loading...
Mark Carney: కెనడాను ముక్కలు చేయాలని చూస్తున్న అమెరికా.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు!
కెనడాను ముక్కలు చేయాలని చూస్తున్న అమెరికా.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు!

Mark Carney: కెనడాను ముక్కలు చేయాలని చూస్తున్న అమెరికా.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 17, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాను విభజించి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు, సహజవాయువు వంటి అపార సహజ వనరులతో సుసంపన్నమైన అల్బెర్టా ప్రావిన్స్ కెనడాలోనే కొనసాగాలా? లేదా విడిపోవాలా? అనే అంశంపై సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అల్బెర్టా ప్రావిన్స్ కెనడాలోనే కొనసాగేందుకు ప్రజలు ఓటు వేయాలని కార్నీ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కెనడా సరిహద్దులకు అవతల ఉన్న ఓ శక్తి దేశాన్ని విభజించాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. అల్బెర్టా విడిపోవడానికి అనుకూలంగా ప్రజలు ఓటు వేస్తే.. కెనడా ఏళ్ల తరబడి తీవ్ర అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వివరాలు

అల్బెర్టా వనరులపై అసంతృప్తి వాస్తవమే!

అల్బెర్టా ప్రావిన్స్‌లోని సహజ వనరుల విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు స్థానిక ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయని మార్క్ కార్నీ అంగీకరించారు.

అయితే ఈ సమస్యలకు పరిష్కారం దేశాన్ని విడగొట్టడం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, బెదిరింపులకు కార్నీ కౌంటర్ ఇచ్చారు.

అమెరికా నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోవడంతో పాటు, చమురు ఎగుమతుల విషయంలో ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు పసిఫిక్ లింక్ పైప్‌లైన్ ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా 1.40 లక్షలకు పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వివరించారు. అంతేకాకుండా, కెనడా చమురు ఎగుమతులకు అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు.

వివరాలు

ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలి

కెనడా ఐక్యతకు మద్దతుగా పనిచేస్తున్న వాలంటీర్లను ఉద్దేశించి మార్క్ కార్నీ మాట్లాడారు. సోమవారం జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చొరవ తీసుకోవాలని కోరారు.

'ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇంతకంటే చెత్త సమయం మరొకటి ఉండదు. మన సరిహద్దులకు అవతల ఉన్నవారు మనల్ని విచ్ఛిన్నం చేసి, తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన, విభజన పూరిత వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో మనమంతా ఏకమై ఉండాలి. ఒకరికొకరం మద్దతుగా నిలబడాలని కార్నీ పౌరులకు పిలుపునిచ్చారు.

మరోవైపు అల్బెర్టా ప్రీమియర్ డానియెల్ స్మిత్ ఈ ఓటింగ్‌కు పిలుపునిచ్చినప్పటికీ, ఆ ప్రావిన్స్ కెనడాలోనే కొనసాగాలనే అభిప్రాయానికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం తన ఓటును వినియోగించుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

డిసెంబరులో కెనడాకు ప్రధాని మోదీ

అల్బెర్టా కెనడాలోనే ఉండాలనే దానికి అనుకూలంగా ఓటు వేసినట్లు ఆమె వెల్లడించారు.

మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో పర్యటించనున్నట్లు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. డిసెంబరు 11, 12 తేదీల్లో ఆయన కెనడాలో పర్యటించనున్నట్లు తెలిపింది.

కాల్గరీలోని ఓ రెస్టారెంట్‌లో గురువారం స్థానికులతో మాట్లాడిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా మోదీ పర్యటన గురించి ధ్రువీకరించారు.

అయితే ప్రధాని పర్యటన తేదీలను ఖరారు చేసేందుకు ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించడం గమనార్హం.

ADVERTISEMENT