Page Loader
American Airlines: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు రెక్కపై నిల్చుని..
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు రెక్కపై నిల్చుని..

American Airlines: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు రెక్కపై నిల్చుని..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం గేటు వద్ద ఆగిన విమానంలో అకస్మాత్తుగా మంటలు (Plane Catches Fire) చెలరేగాయి. ఈ ఘటనను గమనించిన సిబ్బంది తక్షణమే అప్రమత్తమై, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. విమాన రెక్కపై నిలిచిన ప్రయాణికులను సిబ్బంది కిందకు దింపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు లేదా ప్రాణహాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న దృశ్యాలు