ఆస్ట్రేలియన్ రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు; 55గంటల 26నిమిషాల లైవ్ ప్రోగ్రామ్ హోస్ట్
ఆస్ట్రేలియాకు చెందిన మారియో బెక్స్ అనే రేడియో ప్రెజెంటర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. రెండు రోజులకు పైగా లైవ్ ప్రోగామ్‌ను హోస్ట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఏప్రిల్ 30 నుంచి మే 1, 2023 వరకు 55 గంటల 26 నిమిషాల పాటు అసాధారణమైన రేడియో ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ రికార్డును బద్దలు కొట్టారు. మారియో బెక్స్ పోడ్‌కాస్ట్‌లో 'లైఫ్: ది బాటిల్‌ఫీల్డ్' మోటివేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తుంటారు. ఈ ప్రోగ్రాం ద్వారా జీవితాలపై అవగాహన కల్పించడం, పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందే విధంగా ఇతని ప్రోగామ్ నడుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మారియో చాలా ప్రసిద్ధి చెందారు.
యూకే వ్యక్తి రికార్డును బద్దలు కొట్టిన మారియో
పోడ్‌కాస్ట్ ద్వారా శ్రోతలకు నాన్‌స్టాప్ సలహాలను అందించి గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించాలని మారియో బెక్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో పోడ్‌కాస్ట్ సాయంతో ఈ రికార్డను మారియో బెక్స్ అధిగమించారు. ఇంతకు ఈ ఫీట్ యూకేలోని బ్రాడ్‌ఫోర్డ్‌లో మాట్ హాల్, డాన్ రామ్‌స్‌డెన్ ఇద్దరి పేరిట ఉంది. ఈ ఇద్దరు సంయుక్తంగా ఈ రికార్డు సాధించారు. 2020జూలై 24-26తేదీల్లో 53గంటల 1నిమిషంలో మాట్ హాల్, రామ్‌స్‌డెన్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును మారియో బెక్స్ అధిగమించాడు. మారియో వాస్తవానికి క్రొయేషియాకు చెందినవారు. అతని ప్రొఫెసర్ క్లైవ్ స్మాల్‌మాన్ సూచన మేరకు 90.5 FMలో బ్రాడ్‌కాస్టర్‌గా తన రేడియో కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వచ్చి రేడియో ప్రెజెంటర్ ప్రజెంటర్‌గా స్థిరపడ్డారు.