LOADING...
Bangladesh: రెండు నెలల విరామం తర్వాత..ఢిల్లీలో బంగ్లాదేశ్ వీసా సేవలు తిరిగి ప్రారంభం
రెండు నెలల విరామం తర్వాత..ఢిల్లీలో బంగ్లాదేశ్ వీసా సేవలు తిరిగి ప్రారంభం

Bangladesh: రెండు నెలల విరామం తర్వాత..ఢిల్లీలో బంగ్లాదేశ్ వీసా సేవలు తిరిగి ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం శుక్రవారం నుండి భారత పౌరులకు అన్ని విభాగాల వీసా సేవలను తిరిగి ప్రారంభించింది. గత రెండు నెలలుగా పూర్తిగా నిలిచిపోయిన ఈ వీసా మంజూరు ప్రక్రియ ఇప్పుడు మళ్లీ సాధారణ స్థితికి చేరింది. ఇటీవల బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిఖ్‌ రెహ్మాన్‌ బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు 

భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు

ఢిల్లీలో వీసా జారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అదేవిధంగా, త్వరలోనే ఢాకాలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో కూడా బంగ్లాదేశ్ పౌరులకు భారత్‌కు వీసాలు జారీ చేసే సేవలు పునఃప్రారంభం కానున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారి అనిరుద్ధ దాస్ వెల్లడించారు. వైద్య, పర్యాటక తదితర అన్ని రకాల వీసాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ పరిణామంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement