Page Loader
Barack Obama : విడాకుల పుకార్లకు పులిస్టాప్ పెట్టిన బరాక్ ఒబామా
విడాకుల పుకార్లకు పులిస్టాప్ పెట్టిన బరాక్ ఒబామా

Barack Obama : విడాకుల పుకార్లకు పులిస్టాప్ పెట్టిన బరాక్ ఒబామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా చాలా మందికి ఆదర్శ జంటగా ఉంటారు. వారి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు అందరి చూపు వారికి మరింత గౌరవం చూపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ జంట గురించి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బరాక్ ఒబామా, మిచెల్ విడాకులు తీసుకుంటున్న పుకార్లు వ్యాపించాయి. ఈ వార్తలపై బరాక్ ఒబామా స్పందిస్తూ అవన్నీ అసత్యమని స్పష్టం చేశారు. జనవరి 17న మిచెల్ ఒబామా పుట్టినరోజు సందర్భంగా బరాక్ ఒబామా ఒక స్పెషల్ పోస్ట్ చేసి, తన భార్యపై ప్రేమను వ్యక్తం చేశారు.

Details

జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు హాజరు కానీ మిచెల్

తన జీవితంలో అద్భుతమైన ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ఆయన ఫోటోతో కూడిన పోస్టు షేర్ చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లకు బరాక్ ముగింపు పలికారు. ఈ పోస్ట్‌కు మిచెల్ కూడా స్పందిస్తూ లవ్ యు, హనీ అని రాసి వారి బలమైన సంబంధాన్ని మరింత స్పష్టం చేశారు. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల జనవరి 9న జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. ఇది పుకార్లకు ఆజ్యం పోసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోస్ట్ చేసిన బరాక్ ఒబామా