Jaishankar: టోక్యోలో విదేశాంగ మంత్రి జైశంకర్.. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చ
క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం జైశంకర్ ఆదివారం జపాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టోక్యోలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమై ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ముందుగా జపాన్, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్‌లోని భారత రాయబారి సిబి జార్జ్ జైశంకర్‌కు స్వాగతం పలికారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు ఇప్పుడు కలవడం ఆసక్తికరంగా మారింది.
మహాత్మాగాంధీ 'గ్లోబల్ ఐకాన్'
తమ ద్వైపాక్షిక ఎజెండా క్రమంగా మెరుగుపడుతోందని, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా విస్తృత చర్చ జరిగినట్లు జైశంకర్ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు దక్షిణ చైనా గుండా వెళ్తున్న సముద్ర మార్గాలు కీలకమని ఇప్పటికే విదేశాంగమంత్రి జైశంకర్ పేర్కొన్నాడు. భారతీయ ప్రవాసులను ఉద్దేశించి జైశంకర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని "గ్లోబల్ ఐకాన్" అని పిలిచేవారని, అతని జీవితమంతా సందేశాలతో నిండికొని ఉందన్నారు. భారతదేశం స్వాతంత్య్ర పొందినప్పుడు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాలు స్వేచ్ఛగా మారాయన్నారు.