Page Loader
Argentina Plane Crash: శాన్ ఫెర్నాండో విమానాశ్రయ సమీపంలో.. కుప్పకూలిన విమానం.. పైలట్, కో-పైలట్ మృతి.
శాన్ ఫెర్నాండో విమానాశ్రయ సమీపంలో.. కుప్పకూలిన విమానం

Argentina Plane Crash: శాన్ ఫెర్నాండో విమానాశ్రయ సమీపంలో.. కుప్పకూలిన విమానం.. పైలట్, కో-పైలట్ మృతి.

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2024
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనాన్ని ఢీకొనడంతో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం, సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో తలెత్తిన లోపం కారణంగా నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న నివాస ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం చివరికి ఒక నివాస ప్రాంతంలో అగ్నికి గురై మండిపోయింది. ఈ ప్రమాదంలో పక్కనున్న కొన్ని ఇళ్లను కూడా దెబ్బతిన్నాయి.

వివరాలు 

సమీపంలోని రహదారులను మూసివేత 

ఈ ఘటనలో పైలట్ అగస్టిన్ ఆర్ఫోర్టే (35),కో-పైలట్ మార్టిన్ ఫెర్నాండెజ్ లోజా (44) మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు ప్రమాద ప్రాంతానికి సమీపంలోని రహదారులను మూసివేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శాన్ ఫెర్నాండో విమానాశ్రయ సమీపంలో.. కుప్పకూలిన విమానం