NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. లిక్కర్‌పై పూర్తస్థాయిలో పన్ను రద్దు.. ఎక్కడో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. లిక్కర్‌పై పూర్తస్థాయిలో పన్ను రద్దు.. ఎక్కడో తెలుసా?
    30శాతం పన్ను రద్దు

    మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. లిక్కర్‌పై పూర్తస్థాయిలో పన్ను రద్దు.. ఎక్కడో తెలుసా?

    వ్రాసిన వారు Stalin
    Jan 02, 2023
    02:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అద్భుతమై ప్రదేశాలకు నెలవైన దుబాయ్‌కు పర్యాటకుల తాకిడి నిత్యం ఉంటుంది. అయితే దేశ పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు.. నూతన సంవత్సరం వేళ.. ఆ దేశ రాజ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

    వాస్తవానికి ఇతర పర్యాటక దేశాలతో పోలిస్తే.. మద్యం తప్ప.. ఇక్కడ అన్ని వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి. తాజాగా లిక్కర్‌ను కూడా మరింత చౌకగా వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది దుబాయ్. ఇందుకోసం లిక్కర్‌పై ఉన్న 30శాతం పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

    అంతేకాదు.. లిక్కర్ లైసెన్స్‌పై కూడా రుసుమును పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు దుబాయ్ రాజ కుటుంబం ప్రకటించింది. ప్రభుత్వానికి చెందిన లిక్కర్ రిటైలర్స్ అయిన మారిటైమ్ అండ్ మెర్సంటైల్ ఇంటర్నేషన్ కూడా ఇందుకు అంగీకరించారు.

    దుబాయ్

    ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మద్య దోహదం...

    చాలా కాలంగా మద్యం అమ్మకాలు దుబాయ్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహద పడుతున్నాయి. అందుకే మద్యం విషయంలో కొంతకాలంగా దుబాయ్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. రంజాన్ నెలలో కూడా పగటిపూట మద్యం విక్రయించేందుకు అనుమతులు ఇచ్చింది.

    లాక్‌డౌన్‌ల సమయంలో హోమ్ డెలివరీ సర్వీసులను కూడా ప్రారంభించింది. తాజాగా మద్యం ప్రియులను ఆకర్షించేందుకు పన్ను రద్దు చేసి.. మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.

    వాస్తవానికి దుబాయ్‌లో లిక్కర్‌పై పన్ను రద్దు చేయాలని దేశ ప్రజలతోపాటు, ప్రయాణికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మద్యంపై పన్ను రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి భారీ స్థాయిలో రాబడి పడిపోతుంది. అయినా.. ఏమాత్రం ఆలోచించకుండా.. భవిష్యత్‌లో పర్యాటక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. పన్నును ఎత్తివేసినట్లు కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ

    ప్రపంచం

    టెస్టులో వైస్ కెప్టెన్‌గా అశ్విన్‌కు అవకాశం ఇవ్వాలి..! క్రికెట్
    చాంపియన్ షిప్ విజేత నిఖత్‌ జరీన్.. పంచ్ ఆదర్స్ క్రికెట్
    కెఎల్ రాహుల్ నీ ఆటకో దండం స్వామి క్రికెట్
    నేపాల్ కొత్త ప్రధానిగా 'ప్రచండ' ప్రమాణ స్వీకారం అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025