Tibet Earthquake: టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రత నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
టిబెట్‌లో గురువారం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ సరిహద్దు ప్రాంతాన్ని భారీ వరదలు ముంచెత్తిన వారం రోజుల తర్వాత ఈ భూకంపం చోటుచేసుకోవడం గమనార్హం. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదు.
వివరాలు
ఆగస్టు 26న టిబెట్‌లో సంభవించిన భారీ వరదలు..
ఆగస్టు 26న టిబెట్‌లో సంభవించిన భారీ వరదల తర్వాత ఈ భూకంపం వచ్చింది.
నేపాల్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్ ప్రాంతంలో హిమానీనదం (గ్లేసియర్) కూలిపోవడంతో ఈ భారీ వరదలు సంభవించాయి.
వరదల ధాటికి పట్టణాలు, లోయలు నీట మునిగాయి.
భారీగా విధ్వంసం చోటుచేసుకోవడంతో పాటు వేలాది మంది మృతి చెందడం లేదా గల్లంతైనట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టిబెట్‌లో భూకంపం
#Earthquake of magnitude 5.0 strikes #Tibet@BiswasSrabastee https://t.co/fonZjyCzIz
— CNBC-TV18 (@CNBCTV18Live) September 3, 2026
వివరాలు
తొలిసారిగా భారీ యంత్రాలను తరలించే అవకాశం..
నేపాల్‌లో మృతుల సంఖ్య 1,252కు చేరింది. మరో 4,200 మందికి పైగా ఆచూకీ ఇంకా లభించలేదు.
గురువారం నాటికి ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.
సరిహద్దు అవతల టిబెట్‌లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ మృతుల సంఖ్య 21కి చేరగా.. మరో 541 మంది గల్లంతైనట్లు చైనా వెల్లడించింది. విపత్తు సంభవించిన తర్వాత చైనా కీలక చర్యలు చేపట్టింది.
వరద నీరు, భారీగా కొట్టుకొచ్చిన శిథిలాల ధాటికి ధ్వంసమైన టిబెట్‌లోని గ్యిరాంగ్ సరిహద్దు మార్గాన్ని తిరిగి తెరిచింది.
దీంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు తొలిసారిగా భారీ యంత్రాలను తరలించే అవకాశం లభించింది.
వివరాలు
సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం..
చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ ప్రసారం చేసిన దృశ్యాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరు కనిపించింది.
ఇరుకైన పర్వత లోయలో ఎక్స్‌కవేటర్లు, సహాయక బృందాలు, శిక్షణ పొందిన కుక్కలు, మనుషుల ఆచూకీ గుర్తించే పరికరాలను మోహరించారు.
అయితే వర్షాలు, బలహీనంగా ఉన్న కొండచరియలు, వేగంగా ప్రవహిస్తున్న నది కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ధ్వంసమైన ప్రాంతంలో తనిఖీ భవనం, పార్కింగ్ ప్రాంతాలు, సిబ్బంది వసతి గృహాల చుట్టుపక్కల సహాయక సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు.
లోతైన ప్రాంతాల్లోనూ శోధన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల సమావేశంలో వెల్లడైన వివరాలను ఉటంకిస్తూ టిబెట్ డైలీ ఈ విషయాన్ని తెలిపింది.
వివరాలు
గల్లంతైన వారిలో 49 మంది భారతీయులు..
చైనా అధికారికంగా విడుదల చేసిన గల్లంతైన వారి జాబితాలో 104 మంది నేపాల్ పౌరులు, 49 మంది భారతీయులు, 33 మంది లాట్వియా పౌరులు ఉన్నారు. స
వీరంతా రెండు పర్యాటక బృందాల్లో ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు.
గల్లంతైన భారతీయుల్లో ఎక్కువ మంది టిబెట్‌లోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలైన మానస సరోవర్ సరస్సు, కైలాస పర్వతాన్ని దర్శించేందుకు వెళ్లిన యాత్రికులే ఉన్నారు.
ఇదిలా ఉండగా.. సహాయక, పునరావాస చర్యలకు మద్దతుగా నేపాల్‌కు మరింత సాయం అందిస్తామని బీజింగ్ ప్రకటించింది.
డీఎన్‌ఏ ద్వారా మృతులను గుర్తించడంలో నిపుణులను పంపడంతో పాటు అత్యవసర సామగ్రిని కూడా అందించనుంది.
తాత్కాలిక బేలీ వంతెనలు, మృతదేహాలను భద్రపరిచే రిఫ్రిజిరేటర్లు, కమ్యూనికేషన్ పరికరాలను నేపాల్‌కు పంపనున్నట్లు చైనా తెలిపింది.