Loading...
Algeria Fire: ఘోర అగ్నిప్రమాదం.. ఫోస్టర్ కేర్ హోమ్‌లో 11 మంది సజీవదహనం
ఘోర అగ్నిప్రమాదం.. ఫోస్టర్ కేర్ హోమ్‌లో 11 మంది సజీవదహనం

Algeria Fire: ఘోర అగ్నిప్రమాదం.. ఫోస్టర్ కేర్ హోమ్‌లో 11 మంది సజీవదహనం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 16, 2026
06:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లోని ఓ ఫోస్టర్ కేర్ హోమ్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. ఫోస్టర్ కేర్ హోమ్‌ అంటే తల్లిదండ్రుల సంరక్షణ లేని చిన్నారులకు తాత్కాలికంగా ఆశ్రయం, సంరక్షణ కల్పించే కేంద్రం. దేశ పౌర రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మరో 19 మంది గాయపడ్డారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో వాటిని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు గంటల పాటు నిరంతరాయంగా మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగించారు.

వివరాలు

ఘటనా స్థలానికి 16 అంబులెన్సులు..

ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

అయితే మృతులు, క్షతగాత్రుల వయసుల గురించి తమ ప్రకటనలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పౌర రక్షణ శాఖ 10 అగ్నిమాపక వాహనాలు, 16 అంబులెన్సులను ఘటనాస్థలికి పంపించింది.

ఇదిలా ఉండగా.. అల్జీరియాలో గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఈ క్రమంలోనే గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి అగ్నిప్రమాదాలు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

వివరాలు

వారిని సురక్షితంగా బయటకు తరలించిన అధికారులు..

అల్జీరియా ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానమంత్రి సిఫీ ఘ్రియెబ్ గురువారం అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు అల్జీర్స్‌లోని రెండు ఆసుపత్రులను సందర్శించారు.

అలాగే ప్రమాదం సంభవించిన సమయంలో ఐదుగురు వికలాంగులను సురక్షితంగా బయటకు తరలించి రక్షించినట్లు అధికారులు తెలిపారు.

ADVERTISEMENT