Jeffrey Epstein: ఎప్స్టీన్ తన వీర్యంతో 'బేబీ రాంచ్' ప్లాన్.. ఒకేసారి 20 మంది మహిళలను గర్భవతులను చేయాలన్నలక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
లైంగిక నేరాల ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein)కు సంబంధించిన మరో కలవరపెట్టే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన స్వంత డీఎన్‌ఏతో మానవ జాతిని విస్తరించాలనే అసహజ ఆలోచనతో 'బేబీ రాంచ్' ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను ఆయన రూపొందించాడన్న ఆరోపణలు ఉన్నాయి. 2019లో న్యూయార్క్ టైమ్స్( The New York Times)ప్రచురించిన కథనం ప్రకారం, న్యూ మెక్సికోలోని తన 'జోరో రాంచ్'(Zorro Ranch)లో ఒకేసారి సుమారు 20మంది మహిళలను తన వీర్యంతో గర్భవతులను చేయాలన్న లక్ష్యాన్ని ఎప్‌స్టీన్ పెట్టుకున్నాడని వెల్లడైంది. అలా చేస్తే తన డీఎన్‌ఏ ఆధారంగా 'సూపర్ రేస్'గా భావించిన ఉన్నతమైన మానవ వర్గాన్ని సృష్టించవచ్చని ఆయన నమ్మినట్లు కథనాలు చెబుతున్నాయి.
వివరాలు
ఈ ప్లాన్‌ను అమలు చేసినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్న నివేదికలు
టెక్నాలజీ ద్వారా మానవ సామర్థ్యాలను పెంపొందించవచ్చని చెప్పే ట్రాన్స్‌హ్యూమనిజం, నియంత్రిత ప్రజననం ద్వారా మెరుగైన జనాభా సాధ్యమనే యూజెనిక్స్ సిద్ధాంతాలపై ఆయనకు ఉన్న ఆసక్తే ఈ ఆలోచనలకు మూలమని సమాచారం. 2000వ దశకం నుంచే ఈ ప్రణాళికపై పలువురు శాస్త్రవేత్తలు,వ్యాపారవేత్తలతో చర్చించినట్లు, భవిష్యత్తు కోసం తన తలతో పాటు పురుషాంగాన్ని క్రయోజెనిక్ విధానంలో శీతలీకరించి భద్రపరచాలన్న కోరికను కూడా వ్యక్తం చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే,ఈ 'బేబీ రాంచ్' ఆలోచనను ఆయన తరచూ ప్రస్తావించినప్పటికీ, వాస్తవంగా అమలు చేసినట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదని, అయినప్పటికీ ఈ ఆరోపణలు ఆయన లైంగిక నేరాలకే కాకుండా ఆయన వికృత మనస్తత్వం, ప్రమాదకర ఆలోచనా ధోరణిని కూడా ప్రపంచానికి బహిర్గతం చేశాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.