LOADING...
Iran: టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దం.. అసలు కారణం వెల్లడించిన ఇరాన్
టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దం.. అసలు కారణం వెల్లడించిన ఇరాన్

Iran: టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దం.. అసలు కారణం వెల్లడించిన ఇరాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికుల్లో కొంతసేపు ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పాక్‌దష్త్, ఖియామ్‌దష్త్ ప్రాంతాల ప్రజలు ఆ శబ్దాలు విని ఎక్కడైనా దాడి జరిగిందేమోనని భయాందోళనకు గురయ్యారు. అయితే కొద్దిసేపటికే ఈ ఘటనపై ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా వివరణ ఇచ్చింది. ప్రభుత్వ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది ఎలాంటి దాడి కాదని స్పష్టం చేసింది. యుద్ధం ముగిసిన తర్వాత మిగిలిపోయిన మందుగుండు సామగ్రిని నియంత్రిత విధానంలో నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ పేలుడు సంభవించిందని తెలిపింది. ముందస్తు భద్రతా చర్యల మధ్య ఈ ప్రక్రియ నిర్వహించామని, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

అన్ని సందేహాలకు తెర

అలాగే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని స్పష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. పేలుడు శబ్దం వినిపించిన వెంటనే దాని అసలు కారణంపై స్పష్టత లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి దాడి జరిగి ఉండొచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేయడంతో అన్ని సందేహాలకు తెరపడింది.

Advertisement