
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలోని మానిటోబాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు.
మరో పదిమంది గాయపడ్డారు. సెమీ ట్రైలర్ ట్రక్కు వృద్ధులు ప్రయాణిస్తున్న చిన్న బస్సును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
కెనడా చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాల్లో ఇది ఒకటి. బస్సులో ప్రయాణిస్తున్న వారు కార్బెర్రీలోని ఒక క్యాసినోకు వెళ్తున్నారని సీబీసీ మీడియా సంస్థ వెల్లడించింది.
ప్రమాద సమయంలో దాదాపు 25 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాబ్ హిల్ చెప్పారు.
గాయపడిన పది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదానికి ఎవరు కారణమై ఉంటారో చెప్పడానికి పోలీసులు నిరాకరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కెనడాలో బస్సు-ట్రక్కు ఢీ
15 Killed In Canada Highway Crash After Truck Hits Bus In Manitoba
— NDTV Videos (@ndtvvideos) June 16, 2023
Read here: https://t.co/G3j3XHF6fA pic.twitter.com/2cF7V2RiWX