LOADING...
Brazil: బ్రెజిల్ COP30  సమావేశంలో భారీ అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు
బ్రెజిల్ COP30  సమావేశంలో భారీ అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు

Brazil: బ్రెజిల్ COP30  సమావేశంలో భారీ అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి COP30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముఖ్య సమావేశాలు జరిగే "బ్లూ జోన్"లోనే మంటలు చెలరేగడంతో అక్కడ ఉండే వేలాది మందిని తరలించారు. ఈ ఘటనలో 21 మంది తీవ్రంగా గాయపడగా, వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

"బ్లూ జోన్"లో మంటలు.. వైరల్ అవుతున్న వీడియో 

వివరాలు 

21 మందికి గాయాలు 

వివరాలకు ప్రకారం... బ్రెజిల్‌లో COP30 వాతావరణ సదస్సు కొనసాగుతోంది. దాదాపు 200 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశంలో ప్రపంచ వాతావరణ చర్యలను మరింత బలపరిచే ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ఈ ప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ పేవిలియన్ ప్రాంతంలో మంటలు మొదలై, భవనం గోడలు, పైకప్పుపై ఉన్న ఫాబ్రిక్‌ షెల్‌ను కూడా వేగంగా అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు భారీగా ఎగసిపడడంతో అక్కడ ఉన్నవాళ్లు అప్రమత్తమై ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో 21 మంది గాయపడ్డారు దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాలు 

ఆరు నిమిషాల్లోనే మంటలు అదుపులోకి..

ఇక, అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేవలం ఆరు నిమిషాల్లోనే మంటలను పూర్తిగా నియంత్రించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు, విద్యుత్ పరికరాలు లేదా మైక్రోవేవ్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.