Loading...
Florida shooting: ఫ్లోరిడాలోని సిటీ బ్యాంక్ క్యాంపస్‌లో కాల్పులు.. అనుమానిత షూటర్ సహా ఇద్దరు మృతి
అనుమానిత షూటర్ సహా ఇద్దరు మృతి

Florida shooting: ఫ్లోరిడాలోని సిటీ బ్యాంక్ క్యాంపస్‌లో కాల్పులు.. అనుమానిత షూటర్ సహా ఇద్దరు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. టాంపా సమీపంలోని బ్రాండన్ ప్రాంతంలో ఉన్న సిటీ బ్యాంక్ కార్యాలయ సముదాయంలో బుధవారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెంటనే అప్రమత్తమైంది. 360 మందికి పైగా డిప్యూటీలను ఘటనా స్థలానికి పంపించింది. బ్యాంక్ కార్యాలయ భవనాల్లో ఉన్న ఉద్యోగులను బయటకు తరలించారు. ఈ ఘటనను వ్యూహాత్మకంగా జరిపిన దాడిగా భావిస్తున్నట్లు షెరీఫ్ చాడ్ క్రోనిస్టర్ తెలిపారు. భవనాల్లో తనిఖీలు నిర్వహించి, ముప్పును తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం స్థానికులకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

వివరాలు 

పరిసర ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు

కాల్పుల నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు పంపించారు.

అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు.

అయితే ఈ ఘటనలో మరెవరైనా గాయపడ్డారా? అనే విషయం వెంటనే తెలియరాలేదు.

బ్రాండన్‌లోని సిటీ బ్యాంక్ క్యాంపస్‌లో మూడు అంతస్తులున్న నాలుగు భవనాలు ఉన్నాయి. ఈ కార్యాలయ సముదాయంలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఘటనపై సిటీ గ్రూప్ స్పందించింది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు వెల్లడించింది.

ADVERTISEMENT