తదుపరి వార్తా కథనం

Burkina Faso: బుర్కినా ఫాసోలో మారణహోమం.. గంటల్లో 600 మంది మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 05, 2024
09:53 am
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఆగస్టులో జరిగిన ఓ క్రూర ఘటనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఆగస్టు 24న బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు పట్టణంపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ మారణహోమంలో అత్యధికంగా మహిళలు, పిల్లలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
Details
బుర్కినా ఫాసోలో క్రమంగా పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు
ఈ దాడి చాలా కాలం వరకు బయటకు రాకపోవడం, మృతుల సంఖ్య భారీగా ఉండటం ప్రపంచాన్ని చలించుకుపోయేలా చేసింది.
ఈ దారుణానికి అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన రెబల్ గ్రూపులు కారణమని భావిస్తున్నారు.
బుర్కినా ఫాసోలో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగించేలా మారింది.