NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Germany: జర్మనీలో విమాన సర్వీసులపై సమ్మె ప్రభావం.. 3400 విమానాలు రద్దు!
    తదుపరి వార్తా కథనం
    Germany: జర్మనీలో విమాన సర్వీసులపై సమ్మె ప్రభావం.. 3400 విమానాలు రద్దు!
    జర్మనీలో విమాన సర్వీసులపై సమ్మె ప్రభావం.. 3400 విమానాలు రద్దు!

    Germany: జర్మనీలో విమాన సర్వీసులపై సమ్మె ప్రభావం.. 3400 విమానాలు రద్దు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 10, 2025
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జర్మనీలోని విమానాశ్రయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు.

    దీనివల్ల ఫ్రాంక్‌ఫర్ట్‌, మ్యూనిక్‌ సహా ప్రధాన నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది.

    వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. మొత్తం 5 లక్షల మంది ప్రయాణికులపై దీని ప్రభావం పడనున్నట్లు అంచనా వేయబడింది.

    ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎయిర్‌పోర్టు నుంచి 1116 విమానాలు రాకపోకలు సాగించాల్సి ఉండగా, వీటిలో 1054 సర్వీసులు రద్దయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది.

    బెర్లిన్‌ నుంచి నడిచే అన్ని విమానాలు రద్దయ్యాయి. హాంబర్గ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

    కొలోన్‌ ఎయిర్‌పోర్టు తన విమాన సర్వీసులు రద్దయినట్లు ప్రకటించగా, మ్యూనిక్‌ విమానాశ్రయ అధికారులు సమ్మె కారణంగా విమాన సర్వీసుల సంఖ్య భారీగా తగ్గినట్లు ప్రయాణికులకు తెలియజేశారు.

    వివరాలు 

     5 లక్షల మంది ప్రయాణికులపై సమ్మె ప్రభావం 

    మొత్తం 3400 విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశముందని జర్మనీ ఎయిర్‌పోర్టు ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ అంచనా వేసింది.

    దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులపై దీని ప్రభావం పడనున్నట్లు పేర్కొంది.

    వేతనాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తుండగా, పని ప్రదేశంలో ఉన్న షరతులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని, అదనపు సమయానికి ఎక్కువ మొత్తంలో బోనస్‌ ఇవ్వాలని విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బంది, కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

    అయితే, వారి డిమాండ్లను నెరవేర్చలేమని ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి.

    ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగ, కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఈ నెల చివర్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని అంచనా వేయబడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జర్మనీ

    తాజా

    Indo-Pak Tensions: ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష జేపీ నడ్డా
    High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు రాజస్థాన్
    Air Raid Sirens In Delhi: ఢిల్లీలోని పిడబ్ల్యుడి ప్రధాన కార్యాలయంలో వైమానిక దాడి సైరన్  పరీక్ష దిల్లీ
    Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక సోషల్ మీడియా

    జర్మనీ

    ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ భారీగా యుద్ధ ట్యాంకుల సాయం! ఉక్రెయిన్
    ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు అదిరిపోయే డిజైన్ తో రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ ఆటో మొబైల్
    IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి విమానం
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025