Loading...
Germany: జనంపైకి దూసుకెళ్లిన BMW కారు.. పలువురికి తీవ్ర గాయాలు
జనంపైకి దూసుకెళ్లిన BMW కారు.. పలువురికి తీవ్ర గాయాలు

Germany: జనంపైకి దూసుకెళ్లిన BMW కారు.. పలువురికి తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీ న్యూస్టాడ్ట్ ఆమ్ రూబెన్‌బర్గ్‌లో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి కొందరు కారుతో జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నలుగురి నుంచి ఐదుగురి వరకు గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలైనట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మంగళవారం పోలీసు ప్రతినిధి ఈ వివరాలను ధ్రువీకరించినట్లు పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో పాల్గొన్నవారికి గతంలోనే పరిచయం ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

కారుపై పోలీసులు కాల్పులు

పోలీసులు సాధారణ ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వెంటనే స్పందించిన పోలీసులు మరింత మంది గాయపడకుండా చర్యలు చేపట్టారు.

ఘటన సమయంలో ఆ కారుపై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.

అయితే, కారులో ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT