Germany: జర్మనీ రైలులో భారత పర్యాటకుల పాటలు.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీలో రద్దీగా ప్రయాణిస్తున్న ఓ రైలులో కొందరు భారత పర్యాటకులు పాటలు పాడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రైలు బోగీలో బిగ్గరగా పాటలు పాడటం,చప్పట్లు కొడుతూ హల్‌చల్ చేయడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. విదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో వ్యవహరించే తీరుపై ఆవీడియో మరోసారి చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న దృశ్యాల్లో కొందరు భారత పర్యాటకులు రైలు మధ్యలో నిల్చొని గట్టిగా పాటలు పాడుతూ,చప్పట్లు కొడుతూ కనిపించారు. వారితో పాటు ఉన్న మరికొందరు చేతులు ఊపుతూ ఉత్సాహపరచడంతో పాటు,తమ ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డు చేశారు. అయితే చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రయాణికులు మాత్రం నిశ్శబ్దంగా తమ స్థానాల్లో కూర్చున్నారు. కొందరు ఈ హడావుడిని అసంతృప్తిగా గమనిస్తూ కనిపించారు.
వివరాలు
భారత పర్యాటకుల తీరును తప్పుబడుతున్న నెటిజన్లు
Amit24TD అనే యూజర్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది విస్తృతంగా వైరల్ అయింది.
వీడియోపై స్పందించిన పలువురు నెటిజన్లు భారత పర్యాటకుల తీరును తప్పుబడుతున్నారు.
ఇలాంటి ఘటనలు విదేశాల్లో భారతీయుల గురించి ప్రతికూల అభిప్రాయం ఏర్పడేందుకు కారణమవుతాయని కొందరు వ్యాఖ్యానించారు.
రద్దీగా ఉండే ప్రజా రవాణాలో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం సమంజసం కాదని మరికొందరు పేర్కొన్నారు.
వ్యక్తిగత వేడుకలు, సరదాలను బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై రుద్దడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో ఇంత మంది ప్రయాణికుల మధ్య ఈ ఘటన జరుగుతున్నా రైల్వే సిబ్బంది లేదా అధికారులు ఎందుకు జోక్యం చేసుకోలేదని కొందరు ప్రశ్నించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రద్దీ రైలులో పాటలు, చప్పట్లు.. భారత పర్యాటకులపై నెటిజన్ల మండిపాటు
A group of Gujarati Hindus boarded a bus in Germany and started singing loudly while everyone else remained quiet;in doing so,they were disturbing the other passengers.
— Amit _ (@Amit24TD) August 31, 2026
Extremely embarrassing for India.If this continues,Indians could soon face strict visa restrictions worldwide. pic.twitter.com/nqKpAci1YV