LOADING...
Mexico Shooting: మెక్సికోలో విచక్షణారహితంగా కాల్పులు.. ఆరుగురు మృతి 
Mexico Shooting: మెక్సికోలో విచక్షణారహితంగా కాల్పులు.. ఆరుగురు మృతి

Mexico Shooting: మెక్సికోలో విచక్షణారహితంగా కాల్పులు.. ఆరుగురు మృతి 

వ్రాసిన వారు Stalin
Dec 30, 2023
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర మెక్సికోలో హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు దుండగులు ఓ పార్టీలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. సరిహద్దు రాష్ట్రమైన సోనోరాలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఇద్దరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు. ఇది కాకుండా, గాయపడిన వారిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పల్లో దుండగులు హతమయ్యారని అధికారులు తెలిపారు.

తుపాకీ కాల్పులు

ప్రీ-క్రిస్మస్ వేడుకలో 12 మంది మృతి

మెక్సికోలో కూడా కాల్పుల ఘటనలు సర్వసాధారణమైపోయాయి. దాదాపు 12 రోజుల క్రితం ప్రీ క్రిస్మస్ పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 12 మంది చనిపోయారు. సెంట్రల్ మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు దుండగులు కలిసి ఒక ఈవెంట్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇందులో 12 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో గ్వానాజువాటో ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Advertisement