
ఇజ్రాయెల్-హమాస్ వార్ : హిజ్బుల్లా రంగంలోకి దిగితే అంతే సంగతులు
ఈ వార్తాకథనం ఏంటి
హిజ్బుల్లా అంటే లెబనాన్‌లో షియా వర్గానికి చెందిన ఓ రాజకీయ పార్టీ. అంతేనా, ఇదో బలమైన మిలిటింట్ సంస్థ.
ఇరాన్ అండదండలతో ఆర్థికంగా, ఆయుధపరంగా శక్తివంతంగా తయారైంది. ఈ సంస్థకు ఇరాన్ అన్ని రకాలుగా సాయం అందిస్తోంది.
ఇజ్రాయెల్‌ను తొలగించి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడమే హిజ్బుల్లా లక్ష్యం.
1980ల్లో లెబనాన్‌లో ఏర్పడిన హిజ్బుల్లా, రాజకీయంగానూ, మిలటరీ పరంగానూ శక్తిసామర్థ్యాలను అందిపుచ్చుకుంది. ఈ సంస్థ దగ్గర ఇప్పటికే దాదాపుగా లక్షకుపైగా రాకెట్లు ఉండటం విస్తుబోయే అంశం.
దీంతో హమాస్ ఉగ్రవాదులతో కలిసి ఇజ్రాయెల్ దేశంతో మిలిటెంట్లు తలపడితే పరిస్థితి ఏంటనేది అంతర్జాతీయ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
మరోవైపు స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్షిపణులనూ ఈ సంస్థ సమకూర్చుకుంది.
DETAILS
హిజ్బుల్లా వద్ద లక్షకుపైగా క్రియాశీల బలగాలు
హమాస్ మిలిటెంట్లతో పోలిస్తే హిజ్బుల్లా ఉగ్రవాదుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. ఈ మేరకు హిజ్బుల్లాలో దాదాపుగా లక్షకుపై క్రియాశీల బలగాలు ఉన్నాయని పాశ్చాత్య ఇంటెలెజెన్స్ వర్గాలు అంటున్నాయి.
గతంలో హమాస్, హిజ్బుల్లా ఉగ్రసంస్థలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులు జరిపింది. అయినప్పటికీ వాటిని పూర్తిగా నిర్మూలించలేకపోయింది.
అయితే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముదురుతున్న వేళ, హిజ్బుల్లా రంగంలోకి దిగితే ఎటువంటి వ్యూహాలను ఇజ్రాయెల్ సైన్యం అమలు చేయనుందో అనేది ఉత్కంఠగా మారింది.
ఇజ్రాయెల్ పై హమాస్ అనూహ్య ఉగ్రదాడి అనంతరం కొన్ని రాకెట్లను హిజ్భుల్లా సంస్థ ఇజ్రాయెల్ భూభాగంపై ప్రయోగించింది.
దీన్ని పసిగట్టిన ఇజ్రాయెల్, హిజ్బుల్లా స్థావరాలపై భీకరంగా వైమానిక దాడులు చేపట్టింది.
details
ప్లాన్ ప్రకారమే కదులుతున్న హిజ్బుల్లా సంస్థ
ప్రస్తుతం గాజాలో హమాస్‌పై భీకర యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లాతో భయంకర సవాల్ ఎదురవనుంది.
లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సంస్థ,హమాస్‌తో చేతులు కలిపి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం కలవరం రేపుతోంది.
తగిన సమయం వచ్చినప్పుడు హమాస్ తరపున రంగంలోకి దిగుతామని హిజ్బుల్లా చెబుతోంది.అంతా తమ ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతున్నామని వివరించింది.
ఇజ్రాయెల్‌తో పోరుకు సంబంధించి హమాస్‌తో భాగమయ్యేందుకు రెడిగా ఉన్నామని ఓర్యాలీ సందర్భంగా హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసీమ్ అన్నారు.
యుద్ధం నేపథ్యంలో ఇరాన్,ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూనే ఉంది.గాజాపై దాడులను వెంటనే ఆపాలని విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ ఇజ్రాయెల్‌ను కోరారు.
లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లా యుద్ధంలోకి దిగితే,మిడిల్ ఈస్ట్‌లోని దేశాలకు దాని ప్రభావం విస్తరించే ముప్పు ఉందన్నారు.