India-US: భారత్,అమెరికా భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసే దురుద్దేశంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయి.. కేంద్రానికి నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, అమెరికా భద్రతా ప్రయోజనాలను అడ్డుకునే ఉద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అత్యున్నత స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఏర్పడిన విచారణ కమిటీ గుర్తించింది.
ఈ కమిటీ 2023 నవంబరులో ఏర్పడిన తరువాత, దర్యాప్తుకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని అమెరికా అధికారులు భారత్‌తో పంచుకున్నారు.
ఆ సమాచారంలో, కొన్ని వ్యవస్థీకృత నేర బృందాలు, ఉగ్రవాద సంస్థలు, మాదకద్రవ్యల ముఠాలు తదితరులు చేస్తున్న కార్యకలాపాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చున్నారు.
ఈ సమాచారంతో, భారత్‌లోని విచారణ కమిటీ స్వతంత్రంగా దర్యాప్తు ప్రారంభించింది.
అమెరికా అధికారులు అందించిన సమాచారాన్ని ఆధారంగా, కమిటీ వివిధ నేర కేసుల దస్త్రాలను పరిశీలించి, కీలక సమాచారాన్ని సమీకరించింది.
వివరాలు
భారత ప్రభుత్వానికి కమిటీ తుది నివేదిక
ఈ సమయంలో, భారత్‌లోని వివిధ విచారణ సంస్థల అధికారుల నుండి కూడా ముఖ్యమైన సమాచారం చేరుకుంది.
అమెరికా,భారత్ అధికారులు పరస్పరం వివిధ సందర్శనల ద్వారా సమాచారాన్ని పంచుకున్నారు.
సుదీర్ఘ దర్యాప్తు అనంతరం,కమిటీ తన తుది నివేదికను భారత ప్రభుత్వానికి అందించింది.
ఈ నివేదికలో,దేశ ప్రయోజనాలను నాశనం చేయాలని ప్రయత్నించిన ఓ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచన జారీ చేశారు.
ఆ వ్యక్తి నేర సంబంధాలు,గత చరిత్ర కూడా బయటపడ్డాయి.కమిటీ,ఈ కారణంగా,వీలైనంత త్వరగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
అలాగే, ఇలాంటి నేరాలను అరికట్టడానికి కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచించింది.
ప్రభుత్వ విధానాలలో కొన్ని మెరుగుల అవసరం ఉందని, మార్పులు ద్వారా భారత్ ప్రతిస్పందన సామర్థ్యం మెరుగుపడుతుందని కమిటీ పేర్కొంది.